: కడపలో పోలీసులు, స్మగ్లర్లకు మధ్య కాల్పులు
కడప జిల్లా రామాపురం మండలం పాలకొండ అటవీ ప్రాంతంలో పోలీసులకు, తమిళనాడు ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.