: శ్రీజ, కల్యాణ్ కలసి తీయించుకున్న ఫోటో బహిర్గతం
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు ఎవరన్న విషయమై ఊహాగానాలన్నీ తొలగిపోయాయి. శ్రీజకు కాబోయే భర్త ఇతనేనంటూ కల్యాణ్ అనే యువకుడి ఫోటోలు, సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయగా, ఇప్పుడు అతనేనని కన్ఫర్మ్ అయింది. కల్యాణ్, శ్రీజ జంటగా ఉన్న ఓ చిత్రాన్ని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఒకటి ప్రచురించింది. అందరూ అనుకుంటున్నట్టు కల్యాణ్ ది ఎన్నారై ఫ్యామిలీ కాదని, ఆయన తల్లిదండ్రులు కెప్టెన్ కనుగంటి కృష్ణ, తల్లి జ్యోతిలు హైదరాబాద్ వారేనని తెలుస్తోంది. కల్యాణ్, శ్రీజలకు ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన ఉందని చిరంజీవి సన్నిహితులు వివరించారు. కాగా, వివాహ వేడుక ఎప్పుడు? ఎక్కడ? అన్న వివరాలపై చిరు కుటుంబం ఇంకా అధికారిక ప్రకటన వెలువరించలేదు.