: ఏపీ అంతటా వైకాపా నిరసనల హోరు!
దళితులపై చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, వైకాపా తలపెట్టిన ప్రదర్శనలు ప్రజా జీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయి. పార్టీ పిలుపు మేరకు పలు నగరాలు, పట్టణాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వైకాపా నేతలు పాలాభిషేకాలు చేసి రాస్తోరోకోలకు దిగారు. కమలాపురంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాలాభిషేకం చేయగా, ఏలేశ్వరంలో పరుపుల సుబ్బారావు, కడపలో అంజాద్ బాషా, రాజంపేటలో ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, పోరుమామిళ్లలో జైరాములు, రాజమండ్రిలో ఆకుల వీర్రాజు తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు.