: తిరుమల అన్న ప్రసాద కేంద్రంలో సాంబారులో పడ్డ ఉద్యోగి


తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఓ ఉద్యోగి సాంబారు గిన్నెలో పడిపోయాడు. హరినాథ్ అనే ఉద్యోగి ఓ పెద్ద సాంబారు గిన్నెలో పడటంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన ఇతర ఉద్యోగులు ఆయన్ను అశ్వని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. హరినాథ్ తీవ్ర గాయాల పాలవడంతో పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తిరుమలలో కలకలం సృష్టించింది. వేలమందికి అన్నప్రసాదాన్ని వండి వడ్డించే తిరుమలలో అతిపెద్ద పాత్రల్లో సాంబారు వండుతుంటారు. గతంలోనూ ఇలాగే సాంబారులో ఓ ఉద్యోగి పడి తీవ్ర గాయాల పాలయ్యాడు.

  • Loading...

More Telugu News