: పంతం నెగ్గించుకున్న బ్రిటన్... ప్రత్యేక హోదా సాధించుకుంది!


యూరోపియన్ యూనియన్ లో తాము కొనసాగాలంటే, ప్రత్యేక హోదా ఉండాల్సిందేనని పట్టుబట్టిన బ్రిటన్, తన పంతాన్ని నెగ్గించుకుంది. బ్రిటన్ షరతులకు ఈయూ సభ్య దేశాలు అంగీకరించాయని, రెండు రోజుల చర్చల అనంతరం బ్రిటన్ స్పెషల్ స్టాటస్ కు డీల్ కుదిరిందని ఆ దేశ ప్రధాని డేవిడ్ కెమెరాన్ వెల్లడించారు. ఈ విషయాన్ని బ్రిటన్ పార్లమెంటులో చర్చిస్తామని, ఆపై ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని అన్నారు. కాగా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న బ్రిటన్, పలు మినహాయింపులను డిమాండ్ చేస్తూ, వాటికి అంగీకరిస్తేనే యూనియన్ లో కొనసాగుతామని హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. యూరోకు తాము దూరంగా ఉంటామన్నది ఇందులోని ప్రధాన డిమాండ్. అయితే, స్వేచ్ఛా వాణిజ్యంలో మాత్రం భాగంగానే ఉంటామని బ్రిటన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదాకు సభ్య దేశాల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News