: భూమా రాకను వ్యతిరేకిస్తున్న శిల్పా సోదరులతో చంద్రబాబు భేటీ!
వైకాపా ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేసిన శిల్పా సోదరులతో చంద్రబాబు నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ మేరకు విజయవాడ రావాల్సిందిగా శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలకు చంద్రబాబు నుంచి పిలుపు వెళ్లినట్టు సమాచారం. కర్నూలు జిల్లాలో బలహీనంగా ఉన్న పార్టీ మరింత బలపడాలంటే వీరి చేరిక ముఖ్యమని బాబు భావిస్తున్నారు. భూమా కుటుంబం చేరికపై శిల్పా సోదరులకు చంద్రబాబు నచ్చజెప్పవచ్చని, వీరితో మాట్లాడిన తరువాతనే భూమా పార్టీలో చేరికపై అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.