: సమ్మక్క, సారలమ్మల మహాత్మ్యమే ఇది!
సాధారణంగా బెల్లం ముక్క ఎక్కడ కనిపించినా, దాని చుట్టూ ఈగలు వాలుతాయి. కానీ మేడారంలో భక్తులు 'బంగారం'గా పిలుచుకునే బెల్లం విషయంలో మాత్రం పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడూ బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. జాతర జరిగే రోజుల్లో టన్నుల కొద్దీ బెల్లం అమ్ముడవుతుంది. ప్రతి ఒక్కరి చేతిలో ఈ బెల్లం ఉంటుంది. మచ్చుకైనా ఒక్క ఈగ కూడా ఈ ప్రాంతంలో కనిపించదు. జాతర ముగిసిన తరువాత మాత్రమే ఈగలు కనిపిస్తాయి. ఇది సమ్మక్క, సారలమ్మల మహాత్మ్యమేనన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.