: సైన్యాన్ని అడ్డుకున్న జాట్లు... రంగంలోకి ఫైటర్ హెలికాప్టర్లు


రోహ్ తక్... తమకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్లు చేస్తూ, జాట్లు పెను విధ్వంసాలకు దిగుతున్న హర్యానా పట్టణం. ఈ పట్టణంలో జరుగుతున్న హింస తీవ్ర స్థాయికి చేరడంతో కేంద్రం సైనిక బలగాలను పంపింది. నగరానికి దారితీసే రహదారులన్నింటినీ జాట్లు దిగ్బంధం చేయగా, వందలాది వాహనాలు రోడ్లపై ఎటూ కదల్లేని స్థితిలో నిలిచిపోయాయి. సైన్యం ప్రయాణించాల్సిన వాహనాలు సైతం పట్టణంలోకి రాలేకపోయాయి. దీంతో ఫైటర్ హెలికాప్టర్ల సహాయంతో సైన్యం రోహ్ తక్ లోకి ప్రవేశించింది. మరోవైపు జాట్ల విధ్వంసం నేడు కూడా కొనసాగుతోంది. జింద్ లోని రైల్వే స్టేషన్ ను దగ్ధం చేశారని తెలుస్తోంది. పలు చోట్ల షాపుల లూటీలు జరుగుతున్నాయి. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News