: యాపిల్ సంస్థను బాయ్ కాట్ చేయండి: డొనాల్డ్ ట్రంప్


ఓ హంతకుడి ఫోన్ ను అన్ లాక్ చేయడానికి నిరాకరిస్తున్న యాపిల్ సంస్థను అమెరికన్లు బాయ్ కాట్ చేయాలని రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. గత సంవత్సరం కాలిఫోర్నియాలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన హంతకుడు రిజ్వాన్ ఫరూక్ కు చెందిన యాపిల్ ఫోన్ లో నిక్షిప్తమైన సమాచారం పోలీసులకు అత్యవసరం కాగా, ఫోన్ అన్ లాక్ చేసేందుకు యాపిల్ చీఫ్ టిమ్ కుక్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అమెరికా భద్రత పట్ల యాపిల్ ఉదాసీనంగా ఉంటోందని, ఆ సంస్థ బాధ్యతారాహిత్య ప్రవర్తనను అమెరికన్లు తిప్పికొట్టాలని సౌత్ కరోలినాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News