: సెల్ ఫోన్ల ఎఫెక్ట్... చిన్నారులు, టీనేజర్లకు వెన్నెముక సమస్యలు
చిన్నారులు, టీనేజర్లు గంటల తరబడి సెల్ ఫోన్లను వాడుతున్న నేపథ్యంలో 50 శాతం మందిలో వెన్నెముక సమస్యలు పెరుగుతున్నాయని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వారి నడుము ఎముకలు శాశ్వత వైకల్యానికి గురవుతున్నాయని, దీని కారణంగా జీవితకాలం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ముంబైలోని లీలావతి హాస్పిటల్ హెచ్చరించింది. తాము నిర్వహించిన ఓ అధ్యయనంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నవారిలో 79 శాతం మంది సెల్ ఫోన్ల వాడకంలో అత్యధిక సమయం గడుపుతున్నారని, చేతిలో సెల్ ఫోన్లు పట్టుకుని గంటల తరబడి వంగి ఉండటంతో సమస్యలు తీవ్రమవుతున్నాయని పేర్కొంది. "సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్లపై గడుపుతున్న వారిలో మెడ, భుజాల నొప్పి సమస్యలు పెరుగుతున్నాయి" అని లీలావతీ ఆసుపత్రి సీనియర్ వైద్యుడు నిరాద్ ఎస్ వెంగ్ సర్కార్ వెల్లడించారు. దీన్ని నివారించాలంటే సాధ్యమైనంత వరకూ మొబైల్ ఫోన్ కు దూరంగా ఉండాలని సూచించారు.