: హార్దిక్ పటేల్ పరిస్థితి విషమం... జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు


గుజరాత్ లో పటేల్ వర్గీయులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ, రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టించి, ఆపై వివాదాస్పద వ్యాఖ్యలతో జైలుకు వెళ్లి, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న యువనేత హార్దిక్ పటేల్ ఆరోగ్యం విషమించింది. లాజ్ పూర్ జైల్లో దీక్ష చేస్తున్న ఆయన్ను గత రాత్రి పొద్దుపోయిన తరువాత సూరత్ ఆసుపత్రికి తరలించారు. తన కులానికి ఓబీసీ కేటగిరీలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు కల్పించాలని ఆయన నిరాహార దీక్ష మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నారని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ కు హార్దిక్ అనుచరులు ఓ లేఖను రాశారు. కాగా, పటేల్ ఎటువంటి ఆహారమూ తీసుకోకుండా నిరసనకు దిగడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చినట్టు లాజ్ పూర్ జైలర్ ఎస్ఎల్ దుసా మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News