: మహమ్మద్ షమీ ఔట్... భువనేశ్వర్ ఇన్!
ఆసియా కప్ టీ-20లో పాల్గొనే భారత జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గాయపడ్డ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ స్థానంలో భువనేశ్వర్ కుమార్ ను తుది 15 మంది జాబితాలో చేర్చినట్టు బీసీసీఐ వెల్లడించింది. మహమ్మద్ షమీ కోలుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని భావించిన మీదటే, ఆయనకు విశ్రాంతిని ఇస్తున్నట్టు తన అధికారిక ట్విట్టర్ ఖాతాద్వారా బీసీసీఐ పేర్కొంది. మెడికల్ టీం ఆయన్ను పరీక్షించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గత నెలలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో షమీ గాయపడ్డ సంగతి తెలిసిందే.