: బయోలాజికల్ ఈ, జేపీ ఇండస్ట్రీస్, సూర్యలతా స్పిన్నింగ్ మిల్స్... డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ బిజినెస్ మ్యాన్లు!
వారంతా సంఘంలో మంచి పలుకుబడి వున్నవారే. అయితేనేం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ శుక్రవారం రాత్రి పోలీసులకు చిక్కారు. జూబ్లీహిల్స్ లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్న వేళ బయోలాజికల్ ఈ లిమిటెడ్ చీఫ్ నరేందర్, జేపీ ఇండస్ట్రీస్ యజమాని జేపీ రెడ్డి, వీఎస్ ఇంజనీరింగ్ కు చెందిన హరి, సూర్యలతా స్పిన్నింగ్ మిల్స్ మహేందర్ లు పట్టుబడ్డారు. వీరంతా అత్యంత ఖరీదైన కార్లలో వచ్చి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. మొత్తం 9 కార్లు, 3 బైక్ లను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డవారికి కౌన్సిలింగ్ ఇచ్చి, కోర్టులో హాజరు పరచనున్నట్టు వెల్లడించారు.