: సివిల్స్ మెయిన్స్ ఫలితాలు... తెలుగు రాష్ట్రాల నుంచి 1000 మంది


గత సంవత్సరం డిసెంబర్ లో యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్వహించిన సివిల్స్ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. వీటిల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 1000 మందికి పైగా అభ్యర్థులు విజయం సాధించారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి వివరాలను http://www.upsc.gov.inలో ఉంచారు. కాగా, మార్చి 8 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర సెంట్రల్ సర్వీస్ కేడర్ ఉద్యోగాల ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఉద్యోగులకు ఈ-సమన్ లేఖలను 23వ తేదీ నుంచి వెబ్ సైట్ మాధ్యమంగా అందుబాటులో ఉంచనున్నామని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News