: ఏ జైలుకు రమ్మంటే ఆ జైలుకు వస్తా... బెయిల్ కూడా అడగను: ముద్రగడ


ఏ జైలుకు రమ్మంటే ఆ జైలుకు వస్తానని, బెయిల్ కోసం ప్రయత్నం చేయనని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇటీవల తునిలో నిర్వహంచిన కాపు ఐక్య గర్జన సదస్సుకు హాజరైన నాయకులపై కేసులు పెట్టడం సరికాదంటూ ఏపీ డీజీపీ రాముడుకు ఆయన ఒక లేఖ రాశారు. డీజీపీ కోరితే ఈ సదస్సుకు హాజరైన వారి వివరాలను ఇస్తానని, సభ వరకు పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. తనతో పాటు జైలుకు రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. అమాయకులపై కేసులు ఉండవని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News