: జీఎస్టీ బిల్లు ద్వారా రాష్ట్రాల హక్కులు హరించవద్దు: ఈటల
జీఎస్టీ బిల్లు ద్వారా రాష్ట్రాల హక్కులు హరించవద్దని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో జీఎస్టీ బిల్లుపై ఎంపవర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ బిల్లు వల్ల నష్టపోయే రాష్ట్రాలను ఆదుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారని అన్నారు. ఎఫ్ఆర్బీఎం పెంపు, జీఎస్టీ బకాయిల చెల్లింపుపై కేంద్రాన్ని కోరామని ఆయన చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లోగా జీఎస్టీ బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ఆయన, వచ్చే కేబినెట్ భేటీలో ఎఫ్ఆర్బీఎం పెంపు గురించి చర్చిస్తామని అన్నారని ఆయన వెల్లడించారు. అలాగే జీఎస్టీ బిల్లులో లిక్కర్, పెట్రోల్, వ్యవసాయ ఉత్పత్తులు భాగం కాకూడదని కోరామని ఆయన చెప్పారు.