: రాంనగర్-ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు


సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల సంఖ్యను చాలా వరకు తగ్గించవచ్చని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. చిక్కడపల్లి పరిధిలోని రాంనగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News