: దేశంలో రెండు రకాల రాజకీయ పార్టీలు ఉంటాయి: డిగ్గీరాజా ఉపదేశం


భారతదేశంలో రెండు రకాల రాజకీయ పార్టీలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ భవన్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ రెండింటిల్లో మొదటి రకానికి చెందిన పార్టీ పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, డబ్బున్నవారికి కొమ్ముకాస్తుందని, రెండో రకానికి చెందిన పార్టీలో మహాత్మాగాంధీ ఆలోచనలు, నడవడి ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ దారిలో నడిచే పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే అతివాదాన్ని ప్రోత్సహించే పార్టీలతో దేశానికి ప్రమాదమని ఆయన చెప్పారు. భావప్రకటన స్వేచ్ఛను హరించేలా దాడులు జరగడం బాధాకరమని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News