: బీఎస్ఈ నిషేధిత గ్రూప్ లో మరో 19 సంస్థలు
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ‘జడ్’ (నిషేధిత) విభాగంలోకి మరో 19 సంస్థల పేర్లు చేరాయి. ఈ షేర్లకు సంబంధించి ట్రేడ్ -ఫర్- ట్రేడ్ పద్ధతిలో ట్రేడింగ్ జరుగుతుందని ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. కాగా, లిస్టింగ్ నియమాలు, కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలు పాటించని 19 సంస్థల జాబితాలో విశ్వామిత్ర ఫైనాన్షియల్ సర్వీసెస్, మురళి ఇండస్ట్రీస్, అవివా ఇండస్ట్రీస్ తదితర సంస్థలున్నాయి.