: పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాను: భూమా నాగిరెడ్డి
తెలుగుదేశం పార్టీలోకి తాను వెళుతున్నట్లు వస్తున్న వార్తలపై పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిక వార్తలను ఆయన ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రతిసారి స్పందించలేనని విలేకరులతో చెప్పారు. ఈ విషయమై మళ్లీ మాట్లాడతానని చెప్పిన భూమా హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.