: 251 రూపాయల ఫోన్లు ఎన్ని బుక్కయ్యాయో తెలుసా?
మీడియా ప్రచారంతో ఫ్రీడమ్ 251 రూపాయల ఫోన్ పేరు మార్మోగిపోతోంది. దీంతో దీనికి బుకింగ్స్ వెల్లువెత్తాయి. నిన్న ఉదయం ఆరు గంటలకు బుకింగ్ ప్రారంభం కాగా, దీనికి వినియోగదారుల నుంచి ఆర్డర్ల దాడి మొదలైంది. దీంతో ఈ వెబ్ సైట్ ప్రారంభమైన కాసేపటికే క్రాష్ అయిపోయింది. సెకనుకు ఆరు లక్షల మంది ఈ ఫోన్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించారంటే దీనికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఈ తాకిడిని తట్టుకోలేక వెబ్ సైట్ క్రాష్ అయి 24 గంటల మరమ్మతుల తరువాత తెరుచుకుంది. అయితే తొలి రోజు ఈ సైట్ లో బుక్ అయిన ఫోన్ల సంఖ్య తెలుసుకుంటే ముక్కున వేలేసుకోకతప్పదు. సెకనుకు 6 లక్షల మంది దీనిని బుక్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కేవలం 30,000 ఫోన్లు మాత్రమే బుక్ అయినట్టు రింగింగ్ బెల్స్ తెలిపింది. కాగా, జూన్ నెలాఖరు లోపు 50,00,000 సెల్ ఫోన్లు అమ్మాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.