: అఫ్జల్ గురు మా హీరో... థ్యాంక్యూ జేఎన్యూ : కాశ్మీర్లో ఆందోళనకారుల నినాదాలు
‘అఫ్జల్ గురు మా హీరో.. థ్యాంక్యూ జేఎన్యూ’ అనే నినాదాలతో శ్రీనగర్ మార్మోగిపోయింది. జేఎన్ యూ విద్యార్థులకు మద్దతుగా ఈరోజు శ్రీనగర్ లోని జమా మసీదు ప్రాంతంలో ఆందోళనకారులు జెండాలు ప్రదర్శించారు. అఫ్జల్ గురుకు మద్దతుగా నినాదాలు చేసిన ఆందోళనకారులు ఐఎస్ఐఎస్, పాకిస్థాన్ జెండాలను ప్రదర్శించారు. భద్రతా బలగాలు వారిని చెదరగొట్టాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్న ఆందోళనకారులు భద్రతాబలగాలపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటనలో పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు మరికొంతమంది సైనికులను అక్కడికి తరలించారు.