: అమరావతిలో మరో భారీ మెడికల్ హెల్త్ ప్రాజెక్టు


నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మరో భారీ మెడికల్ హెల్త్ ప్రాజెక్టు వచ్చింది. ఇక్కడ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అమృత యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఈ మేరకు విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో విశ్వవిద్యాలయ ప్రతినిధులు చర్చించారు. వర్సిటీకి అనుబంధంగా 2,250 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కూడా చేపడతామని తెలిపింది. దాంతోపాటు రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్ క్యాంపస్ నిర్మాణం చేయనుంది. రూ.2,500 కోట్లతో రాజధానిలో ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం కానుంది.

  • Loading...

More Telugu News