: శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలంటూ కేంద్రానికి తెలంగాణ సీఎస్ లేఖ
శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషీకి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ లేఖ రాశారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 శాసనసభ స్థానాలను 153కు పెంచాలని లేఖలో కోరారు. తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే శాసనసభ స్థానాల సంఖ్య పెంచుతామని నాలుగు రోజుల కిందట కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.