: ఢిల్లీ పోలీస్ బాస్ పై జేఎన్యూ ఎఫెక్ట్!
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్ యూ)లో గొడవ ఢిల్లీ పోలీస్ బాస్ బస్సీకి కీడు చేసింది. ఈ గొడవతో ప్రభుత్వంలో కీలక పదవి ఆయనకు దక్కే అవకాశం లేకుండా పోయింది. కేంద్ర సమాచార కమిషనర్ (సీఐసీ) పదవి కోసం ఎంపిక చేసిన అధికారుల పేర్ల జాబితా నుంచి ఆయన పేరును ప్రభుత్వం తొలగించింది. తొలుత ఆ జాబితాలో బస్సీ పేరుంది. జేఎన్ యూ గొడవ నేపథ్యంలో ఆ జాబితా నుంచి ఆయన పేరును తొలగించినట్లు తాజా సమాచారం. కాగా, వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న బస్సీ ప్రభుత్వంలోని ఈ కీలక పదవికి దరఖాస్తు చేశారు. జేఎన్ యూ విద్యార్థుల ఆందోళనకు సంబంధించి ఆయనపై విమర్శలు తలెత్తిన కారణంగానే సీఐసీ పదవి కోసం ఎంపిక చేసిన పేర్ల జాబితా నుంచి బస్సీ పేరు తొలగించినట్లు తెలుస్తోంది.