: అడ్డుగోడలు కట్టేవారు నేతలెలా అవుతారు?: ట్రంప్ కు పోప్ ఫ్రాన్సిస్ ప్రశ్న


నేతలంటే ప్రజల మధ్య వారధులు నిర్మించేవారని, వారి మధ్య అడ్డుగోడలు కట్టేవారు నేతలెలా అవుతారని పోప్ ఫ్రాన్సిస్ ప్రశ్నించారు. మెక్సికో పర్యటన ముగిసిన సందర్భంగా తిరుగు ప్రయాణంలో ఆయన మీడియాతో మాట్లాడుతుండగా, డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావనను మీడియా ప్రతినిథులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ తీరుపై పోప్ మండిపడ్డారు. అసలు అడ్డుగోడలు నిర్మించేవారు క్రైస్తవులే కాదని అని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత గురువులు రాజకీయాల గురించి మాట్లాడకూడదని అన్నారు. వ్యక్తిగత విశ్వాసాలపై మాట్లాడే హక్కు మతగురువులకు లేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో, ఈ వివాదానికి దూరంగా ఉండాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. కాగా, అమెరికాకు వలస వచ్చిన కోటీ 10 లక్షల మంది అక్రమ వలసదారులు, శరణార్థులను వెళ్లగొడతానని, మెక్సికో సరిహద్దుల్లో భారీ గోడను నిర్మిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News