: రోజా, కొడాలి నాని ప్రవర్తన సరిగా లేదు... బుద్ధ ప్రసాద్ కమిటీ నిర్ధారణ


అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రవర్తనపై ఏర్పాటైన డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఇవాళ తుది సమావేశం నిర్వహించింది. హైదరాబాద్ లోని అసెంబ్లీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, సభలో వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నానిల ప్రవర్తన సరిగా లేదని కమిటీ నిర్ధారించింది. కాబట్టి ప్రవర్తన సరిగా లేని సభ్యులపై చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. ఈ నివేదికను ముందు ఎథిక్స్ కమిటీకి, ఆ తరువాత ప్రివిలేజ్ కమిటీకి సమర్పించనున్నారు.

  • Loading...

More Telugu News