: మూడేళ్లయినా ఈ పిజ్జా పాడవదు!
అమెరికాలో జవాన్లకు అక్కడి ప్రభుత్వం పిజ్జాలు పంపిణీ చేస్తూ ఉంటుంది. అయితే, సూదూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే జవాన్లకు పిజ్జాలు చేరి... వారు తినే లోపే అవి పాడైపోతున్నాయి. దీనికి చెక్ చెప్పేందుకు ఒక ప్రత్యేక పిజ్జా తయారు చేశారు. అమెరికా జవాన్ల కోసం తయారు చేసిన ఈ పిజ్జా మూడేళ్ల వరకు పాడవదని తయారీదారులు చెబుతున్నారు. సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహించే వారికి చేరవేసేందుకు వీలుగా వీటిని తయారు చేయడం జరిగిందని చెబుతున్నారు. ఆర్మీ ల్యాబ్ లో తయారు చేసిన ఈ పిజ్జా కు ‘యంఆర్ఈ37’ గా నామకరణం చేశారు. పిజ్జాలో బ్యాక్టీరియా పెరగకుండా నివారించేందుకు హర్డిల్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని తయారీదారులు చెప్పారు.