: యువకుడి కొంపముంచిన కల!
చైనాలో ఓ యువకుడు నిద్దర్లో తన చేతిని తానే కొరుక్కున్నాడు. అది కూడా మామూలుగా కాదు, రక్తం వచ్చేలా కొరుక్కున్నాడు. జిజియాంగ్ ప్రావిన్స్ లోని లాంగో పట్టణంలో లీ (20) అనే కుర్రాడు తన సోదరి నివాసానికి వెళ్లాడు. అక్కడ రుచికరమైన భోజనం చేస్తూ మాంచి వైన్ కూడా తాగాడు. అనంతరం హాయిగా నిద్రపోయాడు. మధ్యలో ఉన్నట్టుండి గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఇంట్లో వాళ్లు వచ్చి చూడగా అతని నోరు రక్తంతో నిండిపోగా, చేతి కండ ఊడి వచ్చింది. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించిన బంధువులు, ఎవరో అతని చేతికి గాయం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారణ చేయగా, రాత్రి మంచి కల వచ్చిందని, ఆ కలలో రుచికరమైన పోర్క్ లెగ్ పీస్ తింటున్నట్టు అనిపించిందని, అది నిజంగానే తింటున్నానని భావించి, తన చేతి కండను తానే పీక్కుతిన్నానని తెలిపాడు. చర్మం ఊడిరావడంతో బాధతో అలా అరిచానని లీ ఆనక పోలీసులకు అసలు విషయాన్ని చల్లగా చెప్పాడు.