: వాతావరణం అనుకూలిస్తేనే ఉమర్ ఖలీద్ లొంగుబాటు: తండ్రి ఖాసిం
జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో వారం క్రితం మాయమైన ఉమర్ ఖలీద్, లొంగిపోవాలంటే, అందుకు వాతావరణం అనుకూలించాల్సి వుందని ఆయన తండ్రి, ఉగ్రవాద సంస్థ సిమీ మాజీ సభ్యుడు ఖాసిం ఇల్యాస్ వెల్లడించారు. లొంగుబాటుకు అనుకూల పరిస్థితి ఉందని భావిస్తే, తన కుమారుడు లొంగిపోవచ్చని అభిప్రాయపడ్డ ఆయన, చట్టాలపై గౌరవం ఉంచి పోలీసుల ఎదుటకు రావాలని కుమారుడికి పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీ నుంచి అతనెక్కడ ఉన్నాడో తనకు తెలియదని స్పష్టం చేశారు. కాగా, "భరతమాత పేరిట నీపై మీ ఇంట్లోనే అత్యాచారం చేస్తాం" అని తనను బెదిరించినట్టు ఉమర్ సోదరి వెల్లడించారు. జేఎన్యూలో అల్లర్లు చెలరేగకముందు ఉమర్, "కాశ్మీర్ కు స్వాతంత్ర్యం కావాలి" అంటూ నినాదాలు చేసినట్టు వీడియోల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.