: తలారి సత్యంను వాళ్లిద్దరూ కలసి హత్య చేశారు: మంద కృష్ణ
నిజామాబాద్ జిల్లాకు చెందిన దళిత యువకుడు తలారి సత్యం హత్య ఘటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. నిన్న టి.టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే. ఇవాళ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి, ఆర్మూర్ డీఎస్పీ రాంరెడ్డి కలసి సత్యంను హత్య చేశారని హైదరాబాదులో ఆరోపించారు. ఈ విషయంపై మార్చి ఒకటిన డీజీపీని పిలిపించి మాట్లాడతామని ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ తమకు హామీ ఇచ్చారన్నారు. ఈ హత్యతో జీవన్ రెడ్డికి సంబంధం లేకుంటే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు.