: తెలంగాణలో మరిన్ని ఎస్ ఐ పోస్టులకు నోటిఫికేషన్
ఇప్పటికే 539 ఎస్ ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ పోలీస్ శాఖ... ఇవాళ మరిన్ని ఎస్ ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కమ్యూనికేషన్ విభాగంలో 332 ఎస్ ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు పోలీస్ శాఖ తెలిపింది. ఈ నెల 25 నుంచి మార్చి 15 వరకు ఆన్ లైన్ లో ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలను www.tslprb.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.