: తుని ఘటనలో పోలీసుల విచారణకు సహకరిస్తాం: ముద్రగడ


తూర్పుగోదావరి జిల్లా తునిలో రైలు తగలబెట్టిన ఘటనలో పోలీసుల విచారణకు సహకరిస్తామంటూ ఏపీ డీజీపీ రాముడికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి విచారణకు హాజరవుతామని స్పష్టం చేశారు. అయితే తామెవరం ముందస్తు బెయిల్ కోసం వెళ్లమని తెలిపారు. తమది ఆకలితో చేసిన ఉద్యమమేగానీ ఎవరికీ వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. ఆకలితో ఉన్న తమ జాతికి సీఎం చంద్రబాబు ఆక్సిజన్ లాంటి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తుని ఘటనలో ఏపీ ప్రభుత్వం ఆదేశం మేరకు సీఐడీ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News