: ఏపీ ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా కె.నరసింహమూర్తి నియామకం
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ సలహాదారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ సలహాదారులను నియమించుకున్నాయి. ఏపీ విషయానికొస్తే... ఇటీవలే ఎన్నారై వ్యవహారాల పర్యవేక్షణకు విదేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుడు కోమటి జయరాంను సలహాదారుగా నియమించింది. తాజాగా ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ కోసమంటూ మరో ప్రభుత్వ సలహాదారును నియమించుకుంది. ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం గడించిన కె.నరసింహమూర్తిని ఆర్థిక సలహాదారుగా నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఆయనను నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.