: కన్నయ్య బెయిల్ కు సుప్రీం నో!... హైకోర్టుకెందుకెళ్లలేదని ప్రశ్న
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా అత్యున్నత న్యాయస్థానానికే రావడం పట్ల కన్నయ్యను సుప్రీంకోర్టు నిలదీసింది. విచారణ సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించిన సుప్రీం ధర్మాసనం... బెయిల్ కోసం ముందుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని కన్నయ్యను ప్రశ్నించింది. ముందుగా హైకోర్టును ఆశ్రయించి, అక్కడ న్యాయం జరగకుంటే తమ వద్దకు రావాలని సూచిస్తూ ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సుప్రీం కొట్టివేసింది.