: నిన్ను మిస్ అవుతామేమో!... శ్రీజపై వరుణ్ తేజ్ అప్యాయత
త్వరలో వివాహం చేసుకోనున్న మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ లు కలిసి దిగిన ఓ చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కుటుంబమంతా పెళ్లి పనుల్లో తలమునకలైన వేళ, శ్రీజ తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ తో ఓ చిత్రాన్ని దిగి సోషల్ మీడియాలో ఉంచారు. ఐ మిస్ యూ శ్రీజ అన్నట్టు కనిపిస్తున్న ఈ చిత్రంలో తేజ్ కూడా కొంత భావోద్వేగంతో ఉన్నట్టు కనిపిస్తుండటం గమనార్హం. బహుశా తన సోదరికి వివాహం జరుగుతోందన్న ఆనందం ఒకవైపు, మరో ఇంటికి వెళుతుందన్న బాధ మరోవైపు ఆయన కళ్లల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఆ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.