: తెలంగాణ కాంగ్రెస్ లో వారే హీరోలు: గుత్తా


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకూ టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ లీడర్ జానారెడ్డిలు మాత్రమే హీరోలని, అంతకుమించి పార్టీని నడిపించేంత సమర్థవంతులైన నేతలు ఎవరూ లేరని పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఆపై ఖేడ్ ఉపఎన్నికల్లో పార్టీ ఓటమికి ఉత్తమ్, జానాలే కారణమంటూ కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ప్రస్తుతం వారు పార్టీని ముందుకు తీసుకువెళుతున్నారని, ఫిరాయింపుదారుల కారణంగానే పార్టీ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పరిపాలన రాచరికాన్ని తలపిస్తోందని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News