: వాషింగ్టన్ వేదికగా మార్చిలో మోదీ, షరీఫ్ భేటీ?
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ లు మరోసారి భేటీ కానున్నారని సమాచారం. వచ్చే నెల చివర్లో వాషింగ్టన్ లో ప్రపంచ అణుసదస్సు జరగనుంది. మార్చి 31, ఏప్రిల్ 1న జరగనున్న ఆ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వం వహిస్తారు. ఇటువంటి సదస్సుకు మొదటిసారి ఇద్దరు ప్రధానులు హాజరువుతుండగా, ఆ సమయంలోనే మోదీ, షరీఫ్ ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలిసింది. ఇప్పటికే ఈ భేటీకి పాక్ అధికారులు సమాయత్తమవుతుండగా, ఇటు మోదీ పర్యటనపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.