: 'రూ. 68కి ఐఫోన్' అని చిక్కుల్లో పడ్డ స్నాప్ డీల్


కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ ఈ-కామర్స్ వెబ్ సైట్లు అనేక రకాల ఆఫర్లను, ఎమ్మార్పీ ధరలతో పోలిస్తే భారీ డిస్కౌంట్లు ఇస్తాయన్న సంగతి తెలిసిందే. స్నాప్ డీల్ కూడా అదే విధమైన ప్రకటన చేసింది. యాపిల్ ఐఫోన్ ను రూ. 68కే ఇస్తామని సైట్లో యాడ్ ఉంచింది. దీన్ని చూసిన ఓ యువకుడు వెంటనే డబ్బు చెల్లించి, ఫోన్ ను బుక్ చేసుకున్నాడు. అతనికి ఎంతకాలానికీ ఫోన్ రాకపోవడంతో కోర్టుకెక్కాడు. కేసును విచారించిన వినియోగదారుల వివాదాల పరిష్కార కోర్టు స్నాప్ డీల్ కు రూ. 10 వేల జరిమానా విధించింది. పంజాబ్ పరిధిలోని సంగ్రూర్ కు చెందిన నిఖిల్ బన్సాల్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి, జూలై 2014లో రూ. 68 చెల్లించి యాపిల్ ఐఫోన్ 5ఎస్ 16 జీబీ (గోల్డ్)ను కొన్నాడు. ఆపై ఎన్నిమార్లు ఈ-మెయిల్ ద్వారా విన్నవించినా సంస్థ స్పందించలేదు. దీంతో నిఖిల్ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. చిన్న సాంకేతిక లోపం వల్ల ఆ ప్రకటన వచ్చిందని, ఫోన్ ఇవ్వలేమని స్నాప్ డీల్ స్పష్టం చేయడంతో ఆగ్రహించిన ఫోరం, రూ. 10 వేల జరిమానాతో పాటు, నిఖిల్ కు ఖర్చుల నిమిత్తం రూ. 2 వేలు చెల్లించాలని తీర్పిచ్చింది.

  • Loading...

More Telugu News