: ఏపీ ఎక్స్ ప్రెస్ చక్రాల్లో నలిగి తల్లీకూతుళ్ల మృతి... మందమర్రిలో ట్రైన్ నిలిపివేత
నవ్యాంధ్ర నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి పయనమైన ఎపీ ఎక్స్ ప్రెస్ రైల్లో నేటి ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఆదిలాబాదు జిల్లా మందమర్రిలో రైలెక్కిన ఓ తల్లి తన కూతురుతో పాటు ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో రైలు నుంచి దూకిన వారిద్దరూ రైలు చక్రాల్లో ఇరుక్కుపోయారు. ట్రైన్ రన్నింగ్ లో ఉండగా జరిగిన ఈ ఘటనలో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాన్ని ఆలస్యంగా గుర్తించిన రైల్వే సిబ్బంది మంచిర్యాలలో రైలును ఆపేశారు. ఆ తర్వాత వారిద్దరి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.