: ఆర్టీసీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలకు షాక్!... డిపాజిట్లు గల్లంతైన వైనం


ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటుతున్న ఏపీలోని అధికార టీడీపీ, విపక్ష వైసీపీలకు ఏపీఎస్ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మాత్రం షాక్ తగిలింది. ఎన్నికలకు ముందే వైసీపీ అనుబంధ విభాగం వైఎస్ఆర్ మజ్దూర్ సంఘ్ ఏర్పడినా, టీడీపీ అనుబంధ ఆర్టీసీ విభాగం కార్మిక పరిషత్... ఎన్నికల సమయంలోనే ఆవిర్భవించింది. ఎన్నికల్లో ఈయూ, ఎన్ఎంయూలతో పాటు ఈ రెండు కార్మిక సంఘాలు కూడా బరిలోకి దిగాయి. అయితే ఆర్టీసీ కార్మికులు మాత్రం ఇరు పార్టీలకు షాకిచ్చారు. ఇరు పార్టీల కార్మిక సంఘాలకు అసలు డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం. కర్నూలు జిల్లా బనగానపల్లె డిపో పరిధిలో కాస్తంత సత్తా చాటిన వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్ మెజారిటీ ఓట్లు సాధించినా, కేవలం రెండు ఓట్ల తేడాతో అపజయం పాలైంది. ఇక విజయనగరం డిపోలో ఆ సంఘానికి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. ఇదిలా ఉంటే, ఈ రెండు కార్మిక సంఘాలు కొత్తగా బరిలోకి దిగిన నేపథ్యంలో ఈయూ, ఎన్ఎంయూల మధ్య పోరు ఆసక్తికరంగా మారిందన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News