: హీరో కృష్ణ గారు బోళా మనిషి: దర్శకుడు కోదండరామిరెడ్డి
‘హీరో కృష్ణ గారు బోళా మనిషి. లోపల ఏదీ దాచుకోరు.ఆయన ప్రొడ్యూసర్ల మనిషి’ అని దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల హీరోహీరోయిన్లుగా నటించిన ‘శ్రీశ్రీ’ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ చిత్రంలోని ఒక పాటను కోదండరామిరెడ్డి లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘సినిమా రిలీజుకు ముందు ప్రొడ్యూసర్ వచ్చి ఏదైనా ఇబ్బంది ఉందని కృష్ణ గారికి చెబితే.. ఇవ్వాల్సిన డబ్బులు ఏవైనా ఉంటే తర్వాత ఇవ్వమంటారు. ముందు సినిమా రిలీజు చెయ్యండంటారు. నాకు తెలిసి ఈ విధంగా చెప్పే ఏకైక హీరో ఆయనే’ అని కోదండరామిరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి హీరో కృష్ణ దంపతులు, కృష్ణంరాజు దంపతులు, ప్రిన్స్ మహేష్ బాబు పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు హాజరయ్యారు.