: విజయవాడలో ముచ్చటపడి బైక్ నడిపిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ సరదాగా గడిపినట్టు కనబడరు. ఎప్పుడూ చాలా సీరియస్ గా ప్రణాళికలు, లెక్కలు వేసుకునే మనిషిలా కనిపిస్తారు. అయితే, ఈమధ్య కాలంలో పలు సందర్భాల్లో ఇందుకు భిన్నంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. అలాగే ఈవేళ విజయవాడలో ఆయన ముచ్చటపడి ఓ బైక్ ను నడిపారు. కోటి రూపాయల బైక్ గా సోషల్ మీడియా, స్థానిక మీడియాలో హల్ చల్ చేసిన బైక్ ను ఆయన సరదాగా నడిపారు. ముఖ్యమంత్రిని బైక్ పై చూసిన అభిమానులు, సహచరులు ఆనందం వ్యక్తం చేశారు.