: మరో అరుదైన ఘనత సాధించిన సచిన్ 'ఆత్మకథ'
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పుస్తకం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలవడంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఇప్పటివరకూ రిటైల్ గా రూ.13.51 కోట్లు వసూలు చేసింది. కాగా, నవంబర్ 6, 2014న ఈ పుస్తకం మార్కెట్లోకి విడుదలైంది. అంతకు ముందే 1,50,289 ప్రతుల ఆర్డర్లను దక్కించుకుని రికార్డు నెలకొల్పింది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత అమ్మకాల్లో టాప్ లో నిలిచింది. అలాగే, యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర పుస్తకంతో పాటు, డాన్ బ్రౌన్, జేకే రోలింగ్ పుస్తకాల అమ్మకాల రికార్డును సైతం ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ బద్దలుకొట్టింది.