: నా మొదటి, చివరి పార్టీ అదే: శత్రుఘ్నసిన్హా


తన మొదటి, చివరి పార్టీ బీజేపీయేనని ఆ పార్టీ సీనియర్ నేత శత్రుఘ్న సిన్హా తెలిపారు. జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ నేత కన్నయ్య కుమార్ పై దేశవ్యాప్తంగా ఏబీవీపీ, బీజేపీ విమర్శలతో హోరెత్తిస్తున్న వేళ అతనిని శత్రుఘ్న సిన్హా వెనకేసుకొచ్చారు. దీనిపై బీహార్ బీజేపీ అధక్షుడు మంగళ్ పాండే మండిపడ్డారు. ఇతరులను వెనకేసుకు రావాలంటే ముందు ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సిన్హా మాట్లాడుతూ, కన్నయ్య కుమార్ పై లాయర్ల దాడి, పోలీసుల నిర్బంధం తనను బాధించాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులపై దేశద్రోహం కేసు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ వ్యతిరేక కార్యకాలాపాలను అరికట్టాల్సిందేనని స్పష్టం చేసిన ఆయన, అందులో అమాయకులు బలికాకూడదని అన్నారు. ఎవరు దోషులో, మరెవరు నిర్దోషులో న్యాయస్థానాలు తేలుస్తాయని ఆయన తెలిపారు. డేరింగ్, డాషింగ్, డైనమిక్ మోదీ అంటే గౌరవం ఉందని ఆయన చెప్పారు. బీజేపీయే తన మొదటి, చివరి పార్టీ అని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News