: టయోటా వాహనాల్లో సీటు బెల్టు సమస్య!


ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా ఆర్ఏవీ స్పోర్ట్స్ వాహనాల సీట్ బెల్ట్ లో సమస్య తలెత్తింది. దీంతో ఆ వాహనాలను వెనక్కి రప్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. జులై 2005 నుంచి 2014 మధ్య కాలంలో తయారైన ఆర్ఏవీ స్పోర్ట్స్ వాహనాల సీట్ బెల్ట్ లో ఈ సమస్య తలెత్తిందని, సుమారు 2.87 మిలియన్ వాహనాలను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిపారు. సీట్ బెల్ట్ లు అందించే రక్షణ సరిపోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అంతేకాకుండా, జపాన్ దేశంలో విక్రయించే 'వాన్ గార్డ్ ఎస్ వీయూ' (2005-2016 మధ్యకాలంలో తయారైనవి) వాహనాలను సైతం వెనక్కి పిలవనున్నట్లు పేర్కొన్నారు. వెనక్కి వచ్చిన వాహనాలకు మరమ్మతులు నిర్వహిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News