: జగన్ కు సవాల్ విసిరిన ఏపీ మంత్రులు
టీడీపీ సర్కార్ ను కూలదోసేందుకు సరిపడా ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చినప్పుడు వారి పేర్లు బయటపెడతానన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పై ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలదోస్తానన్న ప్రతిపక్ష నేత జగన్ కు మతి భ్రమించిందని.. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. జగన్ కు దమ్ముంటే.. తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని వారు సవాల్ విసిరారు.