: 'సరైనోడు' టీజర్ విడుదల...ట్విట్టర్లో పోస్టు చేసిన బన్నీ


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ హీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ నేడు యూట్యూబ్ ద్వారా విడుదల చేసింది. దీనిని బన్నీ (అల్లు అర్జున్) ట్విట్టర్ పేజ్ లో పోస్టు చేశాడు. టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా నిరూపించుకున్న బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ ను యాక్షన్ సన్నివేశాల్లో సరికొత్తగా ఆవిష్కరించాడు. కాగా, కొత్త లుక్ తో బన్నీ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ సినిమాలో మరో రెండు ప్రధాన పాత్రల్లో ఆది పినిశెట్టి, శ్రీకాంత్ నటిస్తుండడంతో దీనిపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కాగా, దీని ఆడియో వేడుకను త్వరలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News