: ‘నీరజ’ చిత్రాన్ని వీక్షించిన కేజ్రీవాల్


రామ్ మాధవన్ దర్శకత్వంలో ప్రముఖ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ప్రధానపాత్రలో నటించిన ‘నీరజ’ చిత్రాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వీక్షించారు. ఢిల్లీలోని ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆప్ నేత కుమార్ విశ్వాస్, సంగీత దర్శకుడు శేఖర్ రవిజైన్ తదితరులు ఈ చిత్రాన్ని వీక్షించారు. కాగా, 1986, సెప్టెంబర్ 5న హైజాక్ కు గురైన 'పాన్ ఆమ్' విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను రక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టిన నీరజ భానోట్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది.

  • Loading...

More Telugu News