: చంద్రబాబు, వెంకయ్య ప్రయాణించే హెలికాఫ్టర్ కు మరమ్మతులు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్ మొరాయించింది. స్వచ్ఛ చిలకలూరిపేట కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వారిద్దరు కలిసి కృష్ణా జిల్లా ఆతుకూరు గ్రామానికి హెలికాఫ్టర్ లో వెళ్లాల్సి ఉంది. అయితే, హెలికాఫ్టర్ టేకాఫ్ కష్టమన్న సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు పైలెట్ తెలియజేశాడు. దీంతో వారి ప్రయాణానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా వీరిని ఆత్కూరు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News